403) ఎంతో శృంగార మైనది యేసుని చరిత మిది

** TELUGU LYRICS **

    ఎంతో శృంగార మైనది యేసుని చరిత మిది యెంతో వేడ్కై యున్నది
    మోక్ష ప్రవేశ మంతటఁ దేజో వంతుఁడు క్రీస్తుఁడు చెంతను దూతా
    శ్రితజన వజ్ఞ్క్తులు వింతగ నుడువఁగ సంతత నవ్య వ సంతము
    గల్గియ నంతజీవ రస వంతఫలోప వనాంతర ములు ద త్ప్రాంత
    ఋనగల పరమపురమునకు సంతసమున జనె జయశబ్దముతో 
    ||ఎంతో||

1.  తెరచి మూయంగ రానట్టి ద్వారములారా మీ శిరము లెత్తుకొని యుండు
    డి యనాదిగ నుండు వర క వాటములారా మీరే యెత్తంగఁ బడుఁడీ
    సురచిన మహిమ స్ఫురణలుగల మీ దొరతన పరిశుద్ధుల కరు
    లగు భీ కర దురితాత్ముల దురమునఁ జిదిపి య పరిమిత బల జయ
    బిరుదాంకితు డై చిరముగ నూతన యెరుసలేమ పుర పరి
    పాలనఁ ద త్పరుఁడై యిదిగో నెరవుగ వచ్చెను నిజ భక్తులతో
    ||ఎంతో||

2.  సుందర మందానిలమందు జీవ సంజీవా నందసౌఖ్య ప్రదమై యుండ
    రేబగ లంటని మందిర వాసులప్పుడు జయజయశబ్దములఁ బొందుగఁ
    గ్రీస్తుని పొగడుచుఁ బాడుచు నందఱు పరమా నందంబునఁ జె
    న్నొంది తనందరి కిందగు రాజుగ వందనములు తగ వరుస నొనర్చుచు
    నందముగా ప్రభుఁ జెందిన భక్తుల బృందములకుఁ దగు విందు
    లొనర్చిరి పొందిక కలిగెను భూమికి ముక్తికి
    ||ఎంతో||

3.  ములపైఁ బెట్టి కళ లీను ధవళ వస్త్రములు గట్టంగ నిచ్చి చెలువుగ
    మరి వా రల చేతుల లో పల విజయార్థపు బర్ణము లొసఁగి సకల
    దూతలు భ క్తులతో గూడి వి మల పీఠము ముం గల నిలువబడి
    పొలువగఁ దమ దే వునకును గ్రీస్తున కెలమిని స్తోత్రము బలఘన
    మనిశము కలుగును గాకని పలికి నుతించిరి
    ||ఎంతో||

4.  పరిశుద్ధవంతు లప్పుడు శాశ్వతానంద భరితులై వీణెలు ధరియించి
    పాటులు బాడుచును గురురాయఁడైన తమ ప్రభుని గుణములు వర్ణించి
    కరుణను నీ ర క్తముచే మము నం దఱి ధరణింగల నరవంశస్థుల
    తరములలో నుం డరుదుగ దేవుని కొఱకుఁగదా మముఁ గొనియుంటిని
    యని మురువుగ నిఁక దే వుని కొఱకుఁగదా మముఁ గొని
    యుంటిని యని మురువుగ నిఁక దే వుని సముఖంబున దొరలను
    నర్చక వరులఁ జేసితివి ధర నేలుదు మిఁక సరియని మ్రొక్కిరి
    ||ఎంతో||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------