336) ఈయనా యేసు రక్షకుడు

** TELUGU LYRICS **

    ఈయనా యేసు రక్షకుడు తన దాయమని రక్షింపఁ దలఁచెనా
    నన్ను నీయనా యేసు రక్షకుఁడు ఆయాసమగు నొక్క మోపు నే
    మోయలేకుండ నా మూపుపై నుండ శ్రేయఃకరపు సిలువఁజూపి నాకు
    హాయి నిచ్చెను భార మంత వెడలించి
    ||ఈయనా||

1.  దురితాత్ముఁడని త్రోయకుండ నన్నుఁ బరిశుద్ధుఁడా యేసు ప్రభుఁడు
    కరుణింప ధరణిలో నిది మహాద్భుతము నే మరుతునా యీ ప్రేమ
    మరణమౌ దాఁక 
    ||ఈయనా||

2.  ఓపఁగూడని దుష్కృతంబుల్ నేను తేపతేపకుఁ జేసి ద్వేషినై యుండఁ
    గోప మింతైన రానీక నన్నుఁ గాపురుషుఁ డని తాను ఖండింపఁ
    డాయె
    ||ఈయనా||

3.  మనస్తమో గుణము లెడబాపెన్ నా దినకరోదయ మట్లు దీప్తిమది
    మించెన్ తన పాదములఁ జాడ లబ్బెన్ సదా వినుతి కెక్కిన వాని
    విమలాత్మ వెలుఁగు
    ||ఈయనా||

4.  హతుఁ డయ్యె నాయేసు నాకై దు ర్గతి తొలఁగి నాకు మో క్షమే
    గల్గు కొఱకు అతి దయాదీర్ఘశాంతుండే దైవ సుతుఁ డని యెఱిగితి
    శోధింపఁగాను
    ||ఈయనా||

5.  దీవింపఁదగు నతని సిలువ నా జీవాంతమగు దనుక చెలఁగి
    మోయుచును ఈ వసుంధర జనుల కెల్ల మీరు సేవించుఁ డేసునని
    చెప్పి చాటుదును
    ||ఈయనా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------