334) ఈ సుదినము యేసు ప్రభువా నీదు దానం

** TELUGU LYRICS **

    ఈ సుదినము - యేసు ప్రభువా - నీదు దానం

1.  పరిశుద్ధంబైన - సమాజకూ-టములన్ మాకు
    ప్రసాదించి - విస్తారమగు - ప్రేమను జూపి - విజయోత్సవమున్
    నడుపుచున్న - యేసు ప్రభువా - నీకే మహిమ

2.  నూతనంబైన - యెరూషలేము - అను పట్టణము
    భర్తకొరకు - పెండ్లి కుమార్తె - వలె సిద్ధపడి - దేవుని నుండి
    వచ్చుట చూచి - సంస్తుతించు - చున్నామిలలో

3.  సంపూర్ణంబైన - సిద్ధిని మేము - పొందెదమిలలో
    స్వచ్ఛంబైన - నీ చిత్తములో - నిలకడ కల్గి - ప్రార్థన యందు
    పోరాడెదము - నీదు కౄపతో - యేసు ప్రభువా

4.  స్వర్ణాలంకృతమై - సూర్యకాంత - పద్మరాగ - రత్నావళితో
    యేసు ప్రభుని - మహిమతో మెరిసే - పరిశుద్ధ ప-
    ట్టణముగ మమ్ము - జేసిన ప్రభువా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------