** TELUGU LYRICS **
ఈ జీవిత ఈత ఈదలేకున్నాను
నా చేయి పట్టుకో నా యేసునాధా
నా చేయి పట్టుకో నా యేసునాధా
1. సారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను
సాయంబురావా సారాకరుణారసధారలే నా కొసగుము
సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము
సాయంబురావా సారాకరుణారసధారలే నా కొసగుము
సాగిపోవను ముందుకు శక్తి నాకిమ్ము
||ఈ జీవిత||
2. సంఘసంబంధముగ శాంతి లేకపోయె సమానతత్వంబు
సమసిపోయె సోదరులే నాకు శత్రువు లయ్యిరి
సమాధానము నొసగ సరగున రావా
2. సంఘసంబంధముగ శాంతి లేకపోయె సమానతత్వంబు
సమసిపోయె సోదరులే నాకు శత్రువు లయ్యిరి
సమాధానము నొసగ సరగున రావా
||ఈ జీవిత||
3. బయట పోరాటములు భయపెట్టుచుండెను బంధువులందరు
బహుదూరులైరి భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె
బాధలన్నియు బావ బహుత్వరగ రావా
3. బయట పోరాటములు భయపెట్టుచుండెను బంధువులందరు
బహుదూరులైరి భార్యపుత్రాదులచే బాధలెన్నో గలిగె
బాధలన్నియు బావ బహుత్వరగ రావా
||ఈ జీవిత||
4. రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె రాష్ట్రముపై
రాష్ట్రంబు రగులుచుండె రాజులకు రాజువై రయమున
రావయ్య రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము
4. రాజ్యముపై రాజ్యంబు రంకె వేయుచుండె రాష్ట్రముపై
రాష్ట్రంబు రగులుచుండె రాజులకు రాజువై రయమున
రావయ్య రాజ్యమేలను ధరణిలో రమ్ము రమ్ము
||ఈ జీవిత||
5. సైతాను చెలరేగి సమయం బిక లేదని సింహపురీతిగా
గద్దిచుచుండె సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి
సమాధానరాజ్యం స్థాపించరావా
5. సైతాను చెలరేగి సమయం బిక లేదని సింహపురీతిగా
గద్దిచుచుండె సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి
సమాధానరాజ్యం స్థాపించరావా
||ఈ జీవిత||
6. మొదటి జామయ్యెను మీరింక రారయ్యె రెండవజామున
జాడలేదె మూడవ జామయ్యె మీరింకా రారయ్యొ
నాలుగవ జామున నడచివస్తున్నారా
6. మొదటి జామయ్యెను మీరింక రారయ్యె రెండవజామున
జాడలేదె మూడవ జామయ్యె మీరింకా రారయ్యొ
నాలుగవ జామున నడచివస్తున్నారా
||ఈ జీవిత||
7. పెండ్లికుమారుండ ప్రభువైన క్రీస్తుండ పెండ్లిసంఘము
నాత్మయు బిలుచుండె పెండ్లివిందులో నేను పెండ్లి
వస్త్రముతోను హల్లెలూయ యని ఆనందింతున్
7. పెండ్లికుమారుండ ప్రభువైన క్రీస్తుండ పెండ్లిసంఘము
నాత్మయు బిలుచుండె పెండ్లివిందులో నేను పెండ్లి
వస్త్రముతోను హల్లెలూయ యని ఆనందింతున్
||ఈ జీవిత||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------