** TELUGU LYRICS **
ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును గరిమతోడ నీవు గైకొను
నిరత ముండెడి ధనమును
నిరత ముండెడి ధనమును
||ధరణి||
1. యేసు నందు నిత్యజీవం బిపుడు దేవుఁ డిచ్చును తీసికొనుము దాని
వేగము దివ్య వరముగ నమ్మికన్
||ధరణి||
2. విడుపు నీదు పాపములను తడవుఁజేయుఁ బోకుమీ విడువ కున్న
నీకుఁ గల్గు వేద నాధికంబుపో
2. విడుపు నీదు పాపములను తడవుఁజేయుఁ బోకుమీ విడువ కున్న
నీకుఁ గల్గు వేద నాధికంబుపో
||ధరణి||
3. పరుల మాటలఁ బట్టి నీవు పడకు మోస మందున నరుల కొఱకు జీవ
మిచ్చిన పరమధాముని నమ్ముమీ
3. పరుల మాటలఁ బట్టి నీవు పడకు మోస మందున నరుల కొఱకు జీవ
మిచ్చిన పరమధాముని నమ్ముమీ
||ధరణి||
4. తలఁచుకొనుమీ ధరణిలోన నిలుచు కాల మంతట విలువలేని యేసు
ప్రేమ విధము చక్కఁగ నెఱుఁగుచు
4. తలఁచుకొనుమీ ధరణిలోన నిలుచు కాల మంతట విలువలేని యేసు
ప్రేమ విధము చక్కఁగ నెఱుఁగుచు
||ధరణి||
5. దేవ కృపను బోలునట్టి దివ్య భాగ్య మొకటియున్ నీవు చూడ బోవు
మిత్ర నేట నెచట వెదకినన్
5. దేవ కృపను బోలునట్టి దివ్య భాగ్య మొకటియున్ నీవు చూడ బోవు
మిత్ర నేట నెచట వెదకినన్
||ధరణి||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------