1173) దెయ్యమా? దైవమా? తెలుసుకో నేస్తమా

** TELUGU LYRICS **

    దెయ్యమా? దైవమా? తెలుసుకో నేస్తమా
    దేహంలో దెయ్యం కూర్చుంది దేవుని చోటే మార్చింది
    మనిషిని మాయచేసి భక్తుని వేషం వేసి
    మతం మత్తులో ముంచింది మారణహోమం చేస్తుంది
    దెయ్యమా? దైవమా? (2)

1.  శ్మశానాలలో దయ్యముందని ఎండిన చెట్టు ఎక్కి ఉందని
    ఎర్రని నిప్పులు కక్కుతుందని తెల్ల చీరతో తిరుగుతుందని
    భ్రమపరిచింది భయపెడుతుంది
    శ్మశానాలలో ఉంది భయం ప్రజల మధ్యనే ఉంది దెయ్యం

2.  దేవలయాలలో పూజులు మసీదులలో నమాజులు
    చర్చిలలో ప్రార్ధనలు ఎక్కడచూచినా భక్తులు
    భక్తుల సంఖ్య పెరుగుతుంది నేరాల సంఖ్య తగ్గకుంది
    ప్రజలలో ఉంది భక్తా? ప్రబలుతుంది దెయ్యం శక్తా?
    నీలో ఉన్నది దైవమా? నీతో ఉన్నది దెయ్యమా?
    దెయ్యమా? దైవమా? (2)
    దెయ్యమా? దైవమా? తెలుసుకో నేస్తమా?
    దేహంలో దెయ్యం కూర్చుంది దేవుని చోటే మార్చింది
    మనిషిని మాయచేసి దేవునికే గుడికట్టి
    మతం మత్తులో ముంచింది మారణహోమం చేస్తుంది
    దెయ్యమా? దైవమా? (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------