** TELUGU LYRICS **
దేవుని ప్రార్థించెదము - దైవ పుత్రుని నామమందు
1. అడుగుడి - మీకు - నిత్తుననెన్
వెదకుడి - మీకు - దొరకుదును
మదిని - నమ్మి - మీరు - తట్టినచో
ముదమున - తలుపు - తీయుదుననె
2. గూఢమైన - సంగతులిలన్
గాఢమై - నీవు - గ్రహింపలేని
వేడిన - పొందెద - విలలో
దండిగ - దానియేలు – పొందెనహా
3. ఇదివరకు - మీరేమిలయున్
నాదు పేరట - అడుగ లేదనెన్
మీదు సంతోష - ము ఇలలో
అధికమగును - పొందిరి శిష్యులు
4. మనలో కార్య - సాధకమైన
తనశక్తి - చొప్పున క్రీస్తు చేయున్
మనమడిగినవాటి - కంటే ఎంతో
ఘనముగా చెరలో - పౌలు పేతురు గాంచె
5. ఊహించువా - టన్నిటి కంటె
సాహసకార్య - ములు ఎన్నో
ఊహకు మించె - నగ్నిగుండములో
ఆహాహా - నలుగురు - తిరుగుచునుండిరి
6. నా నిమిత్తము - జనులు నిన్ను
కాని మాటలెల్ల - పలుకునపుడు
నిన్ను శపించి - హింసించిన
కన్నులెత్తి - ప్రార్థించి - దీవించుమనె
7. నిశ్చయముగా - నేను నిన్ను
ఆశీర్వదింతు - నని పల్కె
నిశ్చయముగ - నభివృద్ధి జేసి
శాశ్వతముగా - తోడై యుందుననె
8. ఎన్ని శోధనలు - వచ్చిన
పెన్నుగా - ప్రార్థించు ప్రభుని
కన్నతండ్రి - నిన్ను విడువడు
సన్నుతించి - పాడు హల్లెలూయా
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------