1259) దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే


** TELUGU LYRICS **

దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే 
నీ బదులేమో మానవా (2)
ధనము కోరుతావా ఆ... ఆ...  
ఘనము కోరుతావా ఆ... ఆ... (2)
అల్పకాల పాపభోగములను కోరుతావా 

జ్ఞానమును అడిగాడు పాపములో మునిగి 
అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆనాడు 
బలమును పొందాడు బలవంతుడయ్యాడు 
బలహీనతలో పడి పోయాడు సమ్సోను
జ్ఞానులు బలవంతులు బంధీలై పోగా 
బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో
ప్రభు కృపను కోరుతావో
||దేవుడే|| 

మన రక్షణ కోరాడు మనకై ఏతెంచాడు 
మనస్థానమందు నిలచి మరణించె మన ప్రభువు
ఆత్మలను అడిగాడు హతసాక్షి అయ్యాడు 
అందరికి మాదిరిని చూపాడు ఆ పౌలు 
యేసువైపు చూస్తు నీవు పయనమౌతావో 
ఆ దేవుని దయను కోరి ధన్యుడౌతావో
మరి ఏమి కోరుతావొ
||దేవుడే|| 

---------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Prema Chalunaya (నీ ప్రేమ చాలునయా)
---------------------------------------------------------------------------