1181) దేవదేవుని గొప్ప పురము పరలోకానందము

** TELUGU LYRICS **

    దేవదేవుని గొప్ప పురము పరలోకానందము క్రైస్తవ జీవితము యా పురము
    ||దేవ||

1.  దేవుని పురము దేదీప్య కరము జీవ మందిరము జేగీయ గృహము
    ||దేవ||

2.  పరిశుద్ధ పురము పరమార్థ కరము పరమ మందిరము పరదైసు
    పురము
    ||దేవ||

3.  ఆనంద పురము ఆది నిరంతరము కాన దుస్తరము ఘన మనోహరము
    ||దేవ||

4.  శృంగార పురము సుర చిర కరము బంగారు మెరము ప్రభల
    భాసురము
    ||దేవ||

5.  వైభవ పురము వంద్య మప్పురము సౌభాగ్య కరము స్ఫటిక మందిరము
    ||దేవ||

6.  కెంపు పాండురము కీర్తి బంధురము ఇంపౌ నగరము ఇదియే
    సుస్థిరము
    ||దేవ||

7.  క్షుదలేని పురము సుక్షేమ కరము ముదము విస్తరము రొదలు
    దుస్తరము
    ||దేవ||

8.  ఆశ్చర్య పురము ఆశ్రయ కరము నిశ్చయపరము నిజదేవ పురము
    ||దేవ||

9.  మాణిక్య పురము మణుల గోపురము వీణెలు స్వరము విన మనోహరము
    ||దేవ||

10. సూర్యభాసురము చొరనట్టి పురము కార్య మబ్బురముఁ గావించు
     గరము
    ||దేవ||

11. సీయోను పురము శ్రేయస్సాగరము మాయ విధురము మరి
     సంపత్కరము
    ||దేవ||

12. ఇచ్చు నిబ్బరము యెరుషలేం పురము మెచ్చౌ నబ్బురము మెరయు
     మా పురము
    ||దేవ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------