** TELUGU LYRICS **
దేవాది దేవుని భూజనులారా - రండి స్తుతించ సదా
1. కరుణ కృపా ప్రేమ - మయుడైన దేవుడు
వరుసగ మనకన్ని - దయ చేయువాడు
వరుసగ మనకన్ని - దయ చేయువాడు
2. వదలక అడుగుది - ఈయంబడు ననెన్
వెదకుడి తట్టుడి - తీయంబడు ననెన్
వెదకుడి తట్టుడి - తీయంబడు ననెన్
3. యేసుని పేరట - వేడిన దానిని
దాసుల కిడును - దేవుడు వేగమే
దాసుల కిడును - దేవుడు వేగమే
4. సుతుని ఇచ్చినవాడు - కొరత గానీయడు
ప్రేతిగా సమస్తము - నిచ్చును దయతో
ప్రేతిగా సమస్తము - నిచ్చును దయతో
5. సత్యమునందు - మనల నడిపించను
నిత్యాత్మను శాశ్వతముగా నెచ్చెను
నిత్యాత్మను శాశ్వతముగా నెచ్చెను
6. ప్రాకటముగా నల్లెలూయ పాడుటకు
సకల మానవులు నిరతము స్తుతింపను
సకల మానవులు నిరతము స్తుతింపను
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------