1212) దేవా నిను ఆరాధించెదము తండ్రి స్తుతులతో ఆర్భాటించెదము

** TELUGU LYRICS **

దేవా నిను ఆరాధించెదము
తండ్రి స్తుతులతో ఆర్భాటించెదము
కీర్తించెదము కొనియాడెదము
ఆత్మతో సత్యముతో

సిలువలో రక్తము చిందించెను
పాపపు భారము తొలగించెను
పరిపూర్ణమైన ప్రేమతో
క్షమియించి రక్షించి దాపు చేర్చెను
ఓ దేవ మా తండ్రి
మీకే స్తోత్రం హల్లేలుయా

శోధనలు ఎన్నో ఎదురేగిన
వేదనలే చెలరేగిన
మమ్మును కాచి బలపరచి
ఆశ్రయమిచ్చి కాపాడును యేసు దేవుడు
ఓ దేవ మా తండ్రి
మీకే స్తోత్రం హల్లేలుయా

నిన్న నేడు నిరంతరం
ఏక రీతిలో ఉన్న ప్రభువా
అల్ఫయు నీవే ఒమేగయు నీవే
ఉన్నతుడా మహోన్నతుడా మీకే స్తోత్రం
ఓ దేవ మా తండ్రి
మీకే స్తోత్రం హల్లేలుయా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------