1213) దేవా నిన్ను నేను విడువను నన్ను

** TELUGU LYRICS **

    దేవా నిన్ను - నేను విడువను నన్ను దీవించు వరకు
    అను పల్లవి: దేవా నిన్ను - నేను విడువను - నన్ను దీ - వించు వరకు

1.  నేటినుండి - మమ్ము నీవు ఆశీర్వదిం - చెద వంచు
    మాదు హృదయ - కోర్కెలనెల్ల - సఫల పరచు - వాడ

2.  లోతునుండి - అబ్రాహాము వేరుపడిన - విధముగా మమ్ము
    లోకమునుండి - వేరుపరచిన - లోకనాథ - నీవేగా

3.  అడవి బీడుల - యెడారిభూముల యేహోవ - తన హస్తములతో
    ఏదేను తోటగా - నగునట్లు మార్పు జేయు - వాడ

4.  సీయోనులో - నుండి నీవు మమ్ము నాశీర్వ - దించెదవు
    ఇమ్ముగా మా - ప్రార్థన లెప్పుడు - ఆలకించు - వాడ

5.  మాదు స్వాస్థ్య - మును నీవు వాక్యముతో - ప్రత్యక్షపరచి
    ఆత్మీయ - పోరాటమునందు - జయము కూర్చు - వాడ

6.  గుండె జారిపోవునట్లు మండిపడుచు - శత్రువురేగ
    అండయై - మము ఆదరించు - బండయైన - క్రీస్తు ప్రభు

7.  ఆదియంతము - లేని దేవా అల్ఫయు - ఓమేగయు నీవే
    హల్లెలూయా స్తోత్రములకు - అర్హుడవు - నీవేగా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments