1223) దేవా! నీ తలంపులు నా కెంతో ప్రియము

** TELUGU LYRICS **

    దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము ఎంతో ప్రియము
    వాటిమొత్తము దాసుడనగునే - నెంచి చెప్పెద గొప్పది గొప్పది

1.  పాతాళపు పాశములు - నన్ను అరికట్టగా
    ఆవరించె మరణ ఉరులు
    క్రుంగిపోతినో దేవా - క్రుంగిపోతినో దేవా
    ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
    అందుకే నే పాడెద - కీర్తించెద

2.  నా మీదికి లేచువారు - నన్ను బెదరించెడు వారు
    దేవ్వ నీ రక్షణ నా నుండి
    దాటిపోయెననె వారు - దాటిపోయెననె వారు
    ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
    అందుకే నే పాడెద - కీర్తించెద

3.  నీవే నా కాపరి నంటివి - కాపుదలలో రాలేక యుంటిని
    పాపినై యుండి పాపమెరుగనంటి
    శాపగ్రస్తుడనైతి దేవా - శాపగ్రస్తుడనైతి దేవా
    ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
    అందుకే నే పాడెద - కీర్తించెద

4.  మూతవేసిన నా మూర్ఖతయును - దాగియుండిన నా పాపమును
    విప్పిచూపి శిక్షింపనంటివి
    కక్షలేని నా దేవా - కక్షలేని నా దేవా
    అర్హతలేనివాడను - సర్వము పోయినవాడను
    అందుకే నే పాడెద - కీర్తించెద

5.  నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లును
    శ్రమపొంది యుండుట నాకు
    మేలని నేర్పించితివి - మేలని నేర్పించితివి
    నీ ధర్మ శాస్త్రము నాకు ప్రియము - దినమెల్ల నేను
    ధ్యానింతును అందుకే నే పాడెద - కీర్తించెద

6.  పర్వతములు తొలగిపోయినను - తత్తరిల్లిన మెట్టలు మట్టమై
    ఒట్టుపెట్టుకొని నేను చెప్పెద
    విడచిపోదు నిన్ నాదు కృప - విడచిపోదు నిన్ నాదు కృప
    నీ వాగ్దానములకే నా స్తోత్రము - నా ఆర్తధ్వనులు
    నా హృదయ ధ్యానం - అంగీకరించు దేవా - కీర్తించెద

7.  నేను చేయునది ఇపుడు - నీవు ఎరుగజాలవనె
    తెలిసికొందువు నీవు ఇక ముందుకు
    నా పరిపూర్ణ మార్గమిదే - నా పరిపూర్ణ మార్గమిదే
    వింటిని నే నీ స్వరము - కంటిని నే నీ రూపము
    హల్లెలూయ పాడెద – కీర్తించెద

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------