1206) దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును

** TELUGU LYRICS **

    దేవా నా దేవుడవు నీవే - వేకువనే నిన్ను వెదకుదును

1.  నీ ప్రభావ బలమును చూడ - నీ పరిశుద్ధాలయమందు
    నే నెంతో ఆశ తోడ - నీ వైపు కాచియున్నాను

2.  నీళ్లు లేక యెండిన చోట - నా ప్రాణము నీ కొరకు
    దాహము గొని యున్నది - నీ మీద ఆశచేత

3.  నిను చూడ నా శరీరం - కృశించి పోవుచున్నది
    నీ కృప జీవముకంటె శ్రేష్ఠం - నా పెదవులు నిన్ను స్తుతించున్

4.  నా పడక మీద నిను దలచి - రాత్రి జాములో ధ్యానించునపుడు
    క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లు - నా ప్రాణము తృప్తి నొందుచున్నది

5.  ఉత్సాహముతో నా నోరు - నిన్నుగూర్చి పాడుచున్నది
    నా జీవిత కాలమంత - ఈలాగున నిన్ను స్తుతియించెదన్

6.  నా సహాయుడా నీ పేరు - బట్టి నా చేతు లెత్తెదను
    నీ చాటున శరణు జొచ్చి - ఉత్సాహధ్వని చేసెదను

7.  నను చంప వెదకెడి వారు - పాతాళమునకు పోయెదరు
    ఖడ్గంబునకు గురియై - మరి నక్కలపాలగుదురు

8.  దేవుని బట్టి రాజానందించున్ - తన తోడు ప్రమాణము చేయు
    ప్రతివాడు అతిశయించును - మూయబడు నబద్ధికుల నోరు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------