1175) దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప

** TELUGU LYRICS **  

    దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా
    ||దేవ||

1.  వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా
    ||దేవ||

2.  పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు
    ||దేవ||

3.  వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే యేసు నామావతారా
    ||దేవ||

4.  భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు
    వాఁడా
    ||దేవ||

5.  కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చే తిని వీడ
    వలదు
    ||దేవ||

6.  మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా
    ||దేవ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments