1300) దైవనిర్ణయం ఈ పరిణయం

** TELUGU LYRICS **

    దైవనిర్ణయం ఈ పరిణయం
    రమణీయం అతిమధురం
    యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం
    నిలిచియుండును ఇలలో కలకాలం

1.  అన్నిటిలో వివాహం ఘనమైనదని
    పానుపు ఏ కల్మషము లేనిదని
    యెహూవాయే కలిగించిన కార్యమని
    మహూన్నతుని వాక్యమే తెలిపెను

2.  పురుషునిలో సగభాగం తన భార్యయని
    ప్రేమించుట అతనికున్న బాధ్యతని
    విధేయత చూపించుట స్త్రీ ధర్మమని
    సజీవుడైన దేవుడే తెలిపెను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------