** TELUGU LYRICS **
1. దైవదర్శనమున యాకోబు - దివ్యముగను చూచి
ఆ స్థలమునకు బేతేలనియెడి నామమును తానిడియె
సుస్థిరముగ మన పరమ తండ్రి - వసియించెడి స్థలమిదియె
ఆ స్థలమునకు బేతేలనియెడి నామమును తానిడియె
సుస్థిరముగ మన పరమ తండ్రి - వసియించెడి స్థలమిదియె
2. దేవుని నిచ్చెనగు క్రీస్తు దివికి నిలువబడెను
దేవుని దూతలు దానిపైని ఎక్కుచు దిగుచున్నారు
దేవుని మందిర మిదియె కాని వేరే స్థలమిదికాదు
దేవుని దూతలు దానిపైని ఎక్కుచు దిగుచున్నారు
దేవుని మందిర మిదియె కాని వేరే స్థలమిదికాదు
3. నిశ్చయముగా నీ స్థలమందు - నిలిచి యుండె నెహోవా
ఆశ్చర్య పరలోకపు గవిని రక్షణ బొందగ రారే
విశ్రాంతి దేవునికి కలుగు - పాపికి భయంకరము
ఆశ్చర్య పరలోకపు గవిని రక్షణ బొందగ రారే
విశ్రాంతి దేవునికి కలుగు - పాపికి భయంకరము
4. ఉన్నత స్థలముల నెక్కించి ఆనందింప జేసి
అనుభవమునందు యాకోబు - స్వాస్థ్యము నొసంగి
ఐగుప్తు యవమానమును దొరలింపజేయును
5. పర్వతములు తత్తరిల్లి తొలగిపోయినను
సర్వదా తన కృపతోడై - నిన్ను నడిపించును
పూర్వమందు పలికిన మాటల - నిర్వహించును నీలో
సర్వదా తన కృపతోడై - నిన్ను నడిపించును
పూర్వమందు పలికిన మాటల - నిర్వహించును నీలో
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------