1118) దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు

** TELUGU LYRICS **

    దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే
    యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు 
    ||దహన||

1.  నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి
    ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి 
    ||దహన||

2.  అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్
    ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు 
    ||దహన||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments