1139) దారుణ మగు మరణ వారిధి దాఁట నెవ్వారి

** TELUGU LYRICS **

    దారుణ మగు మరణ వారిధి దాఁట నెవ్వారి శక్యము సోదర ఘోర
    మగు కెరటములవలె వి స్తారముగ నేరములు పైఁగొని పారు చుండునప్పు
    డద్దరిఁ జేరు టెట్లు దారిఁ గనరే 
    ||దారుణ||

1.  ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు
    ఎక్కడైనను నోడ గనుఁగొని యెక్కిపోద మని తలంచినఁ జెక్క నిర్మతమైన
    యోడ లక్కఱకు రావేమి సేతుము
    ||దారుణ||

2.  మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందట
    పొంగి పారుచు మరణ నది త రంగములఁ జెలంగుచున్నది భంగపడకుఁడి
    మనకు క్రీస్తు సువార్తయను పెను నావ యిదిగో
    ||దారుణ||

3.  వాద రహితుండైన యాది దేవుఁడు దాని నాధుం డనం బరఁగును
    బాధ లొందిన నరుల నందరిఁ జేరఁదీసిన క్రీస్తు యేసు నాధుఁడే నావి
    కుఁ డు క్రైస్తవ వేదమే చుక్కాని దీవికి
    ||దారుణ||

4.  మానవు లందరు మరణాంబుధిని దాఁట మహనీయ మగు నావ యిదె
    దీనిలో నెక్కుటకు ముందే మానుగ వాక్యమును విని సు జ్ఞాన
    మొందినవారు క్రైస్తవ స్నాన మను పత్రికను బొందరె
    ||దారుణ||

5.  విదితంబుగా నిందు విజ్ఞాన బోదకుల్ వినిపించుదురు వాక్యముఁ
    గొదగొనిన యాత్మములు తృప్తిఁ గొనును బ్రభు భోజనములోనే
    హృదయములలో దేవునాత్మ యెపుడు దీపంబై వెలుంగును
    ||దారుణ||

6.  పలువిధ సంగీత ములతో సాగుచు మనము నలయ కుండఁగఁ బోదు
    ము బలముగల యీ యలలు దాఁటి పరమ పురద్వారముల వెలుపల
    గలిసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము
    ||దారుణ||

7.  కరుణామయుని సభలోఁ జొరకపోయిన నిత్య నరక మంత మందున
    మరియు నంత్య దినపు బాధలు విరివిగ వినఁ గోరువారలు మరణ
    మొందక మును ప్రత్యక్షీ కరుణ మను గ్రంథమను వినరే
    ||దారుణ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------