934) చూడుమదే నీ కొరకే సిలువపై

** TELUGU LYRICS **

    చూడుమదే నీ కొరకే
    సిలువపై వ్రేలాడు శ్రీయేసు రక్షకున్

1.  నలుగ గొట్టబడి నీకై - పలుకకుండె మారుగా
    శిరస్సున రక్తధారలు విరిచె రెక్కలను గ్రుచ్చ
    నీ పాపమే, పాదములను - చీల్చెను, బల్లెమై ప్రక్కన్ బొడిచె

2.  రక్తసిక్తమై మోము - ఎఱ్ఱనయ్యె కొయ్యపై
    చూడు వీపున దున్నెను - దీనునిగా జేసె నీ పాపమే
    ప్రభు రక్తము ఏరులై - పారెను, నీ కొరకే సిలువపై

3.  గాయమైన చేతులన్ - దినమెల్ల చాపెనో పాపీ
    చూచుచుండె ప్రేమతో - నీకై కన్నెటిని కార్చుచు
    తన కృపతో, సంధించును - పాపి నిను, చేరుచెంతన్ నీక్షణమే

4.  ఎంతకాల మేడ్పించి - వెలుపలనుంతు వతనిని
    తెరువు హృదయ ద్వారమున్ - పొందు మారుమనస్సును
    ఈ దినమే, నీ పాపముల్ క్షమియించును - నీకిచ్చు సురక్షణను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------