** TELUGU LYRICS **
చూడ గోరెద దేవ మందిరావరణములను చూడ గోరెద
చూడ నాకు నాశ గలదు సుందరావరణములవి
చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదహా
చూడ నాకు నాశ గలదు సుందరావరణములవి
చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదహా
||చూడ||
1. నీదు నివాసములు జూడ నెంతో రమ్యమై తనర నాదు హృదయమునకు
నానంద మిచ్చు నిపుడు నెపుడు
||చూడ||
2. జీవము గల ప్రభుని జూడ జీవి నాలో కేక వేసె కోవెలలకు దొఱికె
గూటి తావు నీ మందిరమున
2. జీవము గల ప్రభుని జూడ జీవి నాలో కేక వేసె కోవెలలకు దొఱికె
గూటి తావు నీ మందిరమున
||చూడ||
3. పిచ్చుకలకు దొఱికె స్థలము ముచ్చట బలిపీఠ మెదుట పెట్టు
కుతూహలముతోను పిల్లల నవి మందిరమున
3. పిచ్చుకలకు దొఱికె స్థలము ముచ్చట బలిపీఠ మెదుట పెట్టు
కుతూహలముతోను పిల్లల నవి మందిరమున
||చూడ||
4. నీదు మందిరంబులోన నిత్యవాసులైనవారు నిక్కముగను ధన్యులగుచు
నిన్ను నన్నుతింతు రహా
4. నీదు మందిరంబులోన నిత్యవాసులైనవారు నిక్కముగను ధన్యులగుచు
నిన్ను నన్నుతింతు రహా
||చూడ||
5. ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగుదు రిల
ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను
5. ప్రభుని వలన బలము నొందు ప్రజలు ధన్యులగుదు రిల
ప్రాణ ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను
||చూడ||
6. నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప నెంతో విలువ గల
నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న
6. నీదు యావరణములలో నేను నొక్క దినము గడుప నెంతో విలువ గల
నాకు వేయినాళ్ల బ్రతుకు కన్న
||చూడ||
7. కానరండు మనము నిపుడె మనము లలర ప్రభుని జూడ మందిరమున
కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక
7. కానరండు మనము నిపుడె మనము లలర ప్రభుని జూడ మందిరమున
కేగి నిండు మనశ్శాంతి బొంది బ్రతుక
||చూడ||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------