905) చిన్నబిడ్డల విన్నపముల నెన్నడైన త్రోయక

** TELUGU LYRICS **

    చిన్నబిడ్డల విన్నపముల నెన్నడైన త్రోయక పన్నుగ విను కన్న తండ్రిని
    సన్నుతింప జేరరే 
    ||చిన్న||

1.  భూమి మీద మానవునిగా స్వామి ఉండినప్పుడు ప్రేమతో అనేక
    మంది పిల్లల దరి జేర్చెను
    ||చిన్న||

2.  చెంత జేర్చి చిన్న పిల్లల చేతులుంచి వారిపై ఎంతో దయతో నాశీర్వ
    దించె యేసు వారిని
    ||చిన్న||

3.  చిన్న పిల్లల పోలికలను ఎన్నోమార్లు బోధలో ఎన్నుకొనుటలో మనయం
    దున్న ప్రేమ దెలిపెను
    ||చిన్న||

4.  పాట పాడి ప్రభుని పేర కోటి స్తుతుల నియ్యరే చాటుగను బాహాటముగను
    మేటి ప్రభుని వేడరే
    ||చిన్న||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------