880) చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి

    చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి శుభవార్తను జాటుఁ
    డి శుభవార్త సకల రాష్ట్రములలోఁ జాటించుఃడని చెప్పె ఢాటిగఁ ప్రభు
    యేసు ||జాటుఁడి||

1.  లోకమును ప్రేమించి లోకరక్షణ కొఱకు ప్రాకటంబుగ సుతునిఁ
    బంపె దేవుఁడటంచుఁ ||జాటుఁడి||

2.  శత్రువుల రక్షింప మిత్రుఁడుగా వచ్చి మైత్రి నసుపు నిచ్చి మరల
    లేచెన టంచుఁ ||జాటుఁడి||

3.  ఎట్టి పాపు లైనఁ బట్టి యేసుని మాట దిట్టముగ నమ్మినఁ బట్టుగ
    క్షమియించుఁ ||జాటుఁడి||

4.  హృదయ శుద్ధిని గోరి సదయుఁడగు రక్షకునిఁ పదిలముగఁ ప్రార్ధింపఁ
    పరిశుద్ధాత్మ నొసంగుఁ ||జాటుఁడి||

5.  నమ్మి బాప్తిస్మంబు నెమ్మిఁ బొందిన మనుజు లిమ్ముగఁ బొందుదు
    రిలను ఘన రక్షణముఁ ||జాటుఁడి||

6.  ఇందు నందు మికుఁ బొందుగ నొసఁగును సందియము లేకుండ సకల
    భాగ్యము లనుచుఁ ||జాటుడి||

No comments:

Post a Comment

Do leave your valuable comments