** TELUGU LYRICS **
ఆనందమే మనకిలలో
మన కానందమే ప్రభు లేచెన్
ఆనందమే మనకిలలో
మన కానందమే ప్రభు లేచెన్
ఆనందమే మనకిలలో
1. పాపుల మిత్రుడు - పాప రహితుడు
పాపులకొరకై - శాప గ్రాహియై
మోపుగ శాపము - వీపున మోసె
పాపపు ఋణము తీర్చె
2. పొంతిపిలాతు - మసుఖమునందు
శాస్త్రుల పెద్దల - యేదుటను నిలిచె
స్తోత్రార్హుండు - మరణము గెలిచె
సైతానును ఓడించె
3. మరణము భయము - లేని వారమై
మరణమున్ గెల్చిన - యేసుని జేరి
తరుణమును - పోగొట్టుకొనక
పరమ ప్రభువును చాటన్
4. లేచిన ప్రభువు - ప్రియులను జూచి
గాంచెద నంచు - అభయమునిచ్చె
తీసివేసెను - చింతయు నంతను
రోసెద మిపుడే లోకమున్
5. పరమునకేగి - పంపెనాత్మను
పరవశులైరి - శిష్యులు గదిలో
కొరతలేని - శక్తిని పొందిరి
శిరముల - నెత్తిచాటిరి
6. మన ప్రభుయేసు - వచ్చుచుండె
మనము - రెప్ప - పాటున మారి
తనివి దీరగా - సంతసించి
వినయుని చేరెదము
7. మహిమ కిరీట - ధారులమై
మహిమ వస్త్రములు ధరించి
మహిమగల - రాజుతో నుండి
మహిని పాలించెదము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------