** TELUGU LYRICS **
ఆశీర్వాదము నీయుమ మా పరమజనక యాశీర్వాదము నీయుమ
ఆశలుదీరంగ నాయు వొసంగుచు వాసిగ కరుణను వర్ధిల్ల బిడ్డకు
||ఆశీర్వాదము||
1. యేసు పెరిగిన యట్టులే నీ దయయందు ఈసు బిడ్డను పెంచుము
వాసిగ మనుజుల కరుణయందున బెరుగ భాసుర వరమిచ్చి బాగుగ
బెంచుము
||ఆశీర్వాదము||
2. నెనరు మీరగ మోషేను నెమ్మదియందు తనర బెంచినట్లుగ ఘనముగ
నీ శాంతి సంతసములయందు తనర నీ బిడ్డను తగురీతి బెంచుము
||ఆశీర్వాదము||
3. ఏ రీతి సమూయేలును నీ సన్నిధిలో నేపుగ బెంచితివో యారీతి నీ
బిడ్డ నాత్మ స్నేహమునందు కోరి బెంచుము ప్రభువ కోర్కెలూరగ వేగ
||ఆశీర్వాదము||
4. సత్య విశ్వాసమునందు చక్కగ బెరుగ శక్తి యొసంగినడ్పుమా సత్య
వాక్యమునందు సరగను వర్ధిల్ల నిత్యము నీ కృప నిచ్చి బ్రోవుమ ప్రభువ
||ఆశీర్వాదము||
5. భక్తి ప్రేమల నీ బిడ్డ బాగుగా బెరుగ శక్తినీయ మా ప్రభువ ముక్తి
పథంబున ముద్దుగ నడువంగ యుక్తజ్ఞానము నిచ్చి యుద్ధరించుమ ప్రభువ
||ఆశీర్వాదము||-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------