186) ఆరాదించెదం ఆర్భాటించెదం

** TELUGU LYRICS **

    ఆరాదించెదం ఆర్భాటించెదం
    మన యేసు రాజునే కీర్తించెదం
    స్తుతి ఘనత మహిమ నిరతం రారాజుకే

1.  సింహాసనాసీనుడైన దేవుడు
    సాతానుపై జయమిచ్చు దేవుడు
    ఏ అపాయము రానీయడు
    ఏ కీడు నీ దరికి చేరనీయడు

2.  వాగ్దానము నెరవేర్చే దేవుడు
    తన కృప మనకు నిత్యం దయచేయును
    హల్లేలూయ గానాలతో
    ఆయన నామం ఘనపరచెదము

    ఆరాధన స్తోత్రార్పణ మన యేసుకే
    స్తుతి ఘనత మహిమ నిరతం రారాజుకే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------