204) ఆరాధనలందుకో ఆరాధనాలందుకో

** TELUGU LYRICS **

ఆరాధనలందుకో ఆరాధనాలందుకో
పాప క్షమాపణ జీవము నిచ్చిన
కరుణామయా అందుకో 

అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవా మోషేతో
అన్నావు ఉన్నానని (2)
అల్ఫయు నీవే ఓమేగయును 
(2)
ఆద్యంత రహితుడవు నీవేనని

ఘనత మహిమ నీకేయని హల్లెలూయ
గానము చేసేదము 
||పాప క్షమాపణ||

పాపంబున జీవించి నశియించితిని లోకంబు
నాదంటు ఆశించితిని అయినా నీవు రక్షణ
నివ్వ ప్రేమించి పంపితివి
యేసుప్రభుని 
||ఘనత|| ||పాప క్షమాపణ||

తెలిసికొంటిని నా యేసు నిన్ను సర్వ శక్తిగల ప్రభువనియు
రానున్నావు మరల నాకై ఆనంద దేశములో
నన్నుంచుటకై
||ఘనత|| ||పాప క్షమాపణ||

అంద సౌందర్యములు వ్యర్థంబనీ ఆశించితి
ముత్యంబుగా నుండుటకై
నిన్న నేడు నిరంతరము మారని మా ప్రభు
నీకే స్తుతులు
||ఘనత|| ||పాప క్షమాపణ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------