5814) లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు లేరు ఎవరు నీలా

** TELUGU LYRICS **

లేరు ఎవరు నీలా నను ప్రేమించటకు 
లేరు ఎవరు నీలా నను పలుకరించుటకు (2)
ప్రతి ఉదయం నూతన కృపతో 
నను పలుకరించిన నా దేవా 
ఎన్నో మేలులు చేసి 
తృప్తి పరచి నడిపిన నా తండ్రీ 
మనసే బలిగా నా హృదయమే కానుకగా (2)
అర్పించానయా నీ పాదము చెంతా 
నే వేచియున్నానయా నీ కొరకై నా తండ్రీ 
||లేరు ఎవరు||

ఒంటరిని నేను కాననీ 
నా తోడై నీ ఉన్నావని (2)
నా కలలను కలలుగా కానీయక
నా ఆశను నిరాశ కానీయక (2)
నా తండ్రిల నా తోడువై 
నను నడిపిన యేసయ్యా (2)
||లేరు ఎవరు||

మంటిని నేను కాననీ 
నీ ఊపిరి నాలో ఉందని (2)
నీ రూపము లోనే నన్ను సృజించి
నీ  పోలికలోనే నన్ను చేసి (2)
నీ ప్రేమతో నన్ను - బ్రతికించిన దేవా (2)
||లేరు ఎవరు||

---------------------------------------------------------------------------
CREDITS : Music : David Selvam
Vocals : Joshua Joshi Mandru
Lyrics, Tune : Raja Mandru, Bro. Bharat Mandru
---------------------------------------------------------------------------