** TELUGU LYRICS **
పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని
వినబడు పుర మదిగో పద పదరే ప్రియులారా
పరమేశ్వరుని చేత బరిపాలనము గల్గి
చిరమై భాసురమై సుస్థిరమై సుందరమైన
వినబడు పుర మదిగో పద పదరే ప్రియులారా
పరమేశ్వరుని చేత బరిపాలనము గల్గి
చిరమై భాసురమై సుస్థిరమై సుందరమైన
||పరిశుద్ధి||
రవితోను కుముదబాం ధవుతోను మఱి దీప
చ్ఛవితోను దాని కవసర మింతలేదు
అవిరతమున గ్రీస్తుడందుండు ప్రభతో
సంస్తవమై వైభవమై యుత్సవమై వెల్గుచు నుండుఁ
రవితోను కుముదబాం ధవుతోను మఱి దీప
చ్ఛవితోను దాని కవసర మింతలేదు
అవిరతమున గ్రీస్తుడందుండు ప్రభతో
సంస్తవమై వైభవమై యుత్సవమై వెల్గుచు నుండుఁ
||పరిశుద్ధి||
గొదయైన మఱియే యా పదయైన దగయైన
మొదలేలేకుండు నప్పుర వాసులందు
మృదు జీవోదకము లర్మిలి నిరంతర మిచ్చు
గుదురుగ నెదురుగ గూర్చుండి యువరాజు
గొదయైన మఱియే యా పదయైన దగయైన
మొదలేలేకుండు నప్పుర వాసులందు
మృదు జీవోదకము లర్మిలి నిరంతర మిచ్చు
గుదురుగ నెదురుగ గూర్చుండి యువరాజు
||పరిశుద్ధి||
జననంబు మరణంబు సంసార సుఖ బాధలను
భవించుట గల్గ దా పురమునందు
మును నీతికొఱ కాపదను బొందు తనవారి
కనునీళ్లన్నియుదుడుచు మన దేవుడందుండి
జననంబు మరణంబు సంసార సుఖ బాధలను
భవించుట గల్గ దా పురమునందు
మును నీతికొఱ కాపదను బొందు తనవారి
కనునీళ్లన్నియుదుడుచు మన దేవుడందుండి
||పరిశుద్ధి||
---------------------------------------------------------------------
CREDITS : Music : Jonah Samuel
Vocal : Anwesshaa Dutta
Lyrics, Tune : Shri. Purushottama Chowdary
---------------------------------------------------------------------