5581) తీరని వేదనతో రగిలే గుండెలతో

** TELUGU LYRICS **

తీరని వేదనతో రగిలే గుండెలతో 
మాడిన కడుపులతో పగిలిన పాదముతో 
అలసిన ముఖములతో ఆగిన స్వరములతో 
రోదన ధ్వనులతో కఠికుపవాసముతో 
బ్రతుకులు కట్టిన సేవకులారా మీకే నా వందనము 
సువార్తకై పరుగులు పెట్టిన మీ పాదములే సుందరము 

చీకటి లోయలలో వెలుగును నింపుటకు 
రక్కసి మూక యొద్ద తనువులు విడిచారు 
మా రాతి గుండెలను బద్దలు కొట్టుటకు అవమానాన్నే ఆనందించారు 
మీలో రగిలిన ప్రసవ వేదనే మాలో కలిగించెను ఈ స్పందనే 
ఎందరినో మార్చిన మీ వేదన-చెరిపెను ఆ దేవుని ఆవేదన 

గర్జించు సింహమువలే అపవాది తిరగగా 
వాడినుండి కాపాడే వాక్యము చూపారు 
లోకపు మాయలో మేము పడకుండా 
లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు 
కన్నీటి అనుభవమే విశ్వాసి ఆయుధమని 
యేసే శరణమని ఆయన కొరకు బ్రతకమని
మాకై తలపించి మీ తనువులు విడిచారు

------------------------------------------------------
CREDITS : Lyrics : Rayapudi David
Music, Vocals, Tune : Moses Dany
------------------------------------------------------