5605) నీ నామంలో సంతోషం పూజ్యనియుడా

** TELUGU LYRICS **

నీ నామంలో సంతోషం పూజ్యనియుడా
నీ కొరకే నా తృష్ణంతా ప్రాణ ప్రియుడా
నిన్ ఆశించును నా ప్రాణమంతా
నీకర్పితుంను నా హృదయమంతా (2)
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (2)

నా మదిలో నీ మాటే మెదలాలిక 
నీ ఆత్మతో నేను కదలాలిక (2)
ప్రతి దినము నా ప్రభుని నే కలవాలిక
ఆరాధనలో అభిషేకం పొందాలిక 
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (2)

ఈ భువిపై నీ బాటే చూపాలిక 
నా దేహం ఆలయమై నిలవాలిక (2)
ప్రతి నేత్రం నీ దృశ్యం చూడాలిక
నీ జీవా కిరీటం పొందాలిక 
ఆరాధన ఆరాధన ఆరాధన నీకే (2)

-----------------------------------------------------------------
CREDITS : Music : Moses Dany
Lyrics, Tune, Vocals : Meghana Medapati
-----------------------------------------------------------------