** TELUGU LYRICS **
వింతైన తారొకటి తూర్పున పుట్టింది
పసందైన వార్తోకటి జ్ఞానుల కిచ్చింది (2)
రక్షకుడేసు రాజుల రాజై (2)
ఉదయించే ధరయందున
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ పండుగ - మెర్రి మెర్రి క్రిస్మస్ పండుగ (2)
పసందైన వార్తోకటి జ్ఞానుల కిచ్చింది (2)
రక్షకుడేసు రాజుల రాజై (2)
ఉదయించే ధరయందున
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ పండుగ - మెర్రి మెర్రి క్రిస్మస్ పండుగ (2)
పాపాంధకారములో మరణపు చాయల వేదనతో (2)
కృంగియున్న వారికి వెలుగునిచ్చి
కృపతో తన రక్షణ అనుగ్రహింపన్ (2)
||రక్షకుడేసు||
సర్వ సృష్టి కారకుడు సకలము చేయగల శక్తిమంతుడు (2)
సర్వలోక పాపపు పరిహారముకై
సిలువలో తన ప్రాణ త్యాగముకై (2)
||రక్షకుడేసు||
-------------------------------------------------------------------------
CREDITS : Lyircs, Tune : Rev.Dr.J.Solomonraju
-------------------------------------------------------------------------