5514) చూసారు దివియందు ఒక తార

** TELUGU LYRICS **

చూసారు దివియందు ఒక తార 
వారు అత్యానంద భరితులైనారు
సర్వాధికారిని చేరారు - చేరి బంగారం భోళం నర్పించారు 
అ:ప: ఊరువాడా కలిసి చేరారు - స్తుతియించగ గళమెత్తి పాడారు 
ఊరువాడా కలిసి చేరారు - అంబరాని కంటేలా సంబరాలు చేసారు

బేత్లేహేము గ్రామమందు పుట్టాడని
పశుశాలలో - పవళించాడని               
రాజులకు రాజు యేసు పుట్టాడని 
పాపుల విమోచకుడు - తానేనని 
||ఊరువాడా||

లోకమును ప్రేమించగ వచ్చాడని
లోపములెన్నొ - తొలగిస్తాడని
వీనులకు విందులు కలిగిస్తాడని
అధ్బుతములు చేసేది - యేసేనని        
||ఊరువాడా||

చీకటిని తొలిగించగా వచ్చాడని
నూతనమైన మనస్సు - ఇస్తాడని
శాంతిని కలిగించువాడు యేసేనని
శాపములు బాపేది - తానేనని
||ఊరువాడా||

చూసారు దివియందు ఒక తార 
వారు అత్యానంద భరితులైనారు
సర్వాధికారిని చేరారు - చేరి బంగారం భోళం నర్పించారు 
అ:ప: ఊరువాడా కలిసి చేరారు -
స్తుతియించగ గళమెత్తి పాడారు 
ఊరువాడా కలిసి చేరారు - 
అంబరాని కంటేలా 
సంబరాలు చేసారు (2)

----------------------------------------------
CREDITS : 
----------------------------------------------