** TELUGU LYRICS **
ధవళవర్ణుడవు నీవు నా రత్నవర్ణుడవు నీవు
తేజోమయుడవు నీవు నా యేసయ్యా,
నీకు సాటి ఎవ్వరు లేరయ్యా లేనే లేరయ్యా రానే రారయ్యా
చూడా సక్కనివాడా సుందరమైనవాడా
చూడముచ్చటాయే నిన్ను చూస్తూ ఉండిపోనా
మేడి చెట్టు ఎక్కి మెల్లగా చూసితిని
యేసయ్యా నిన్ను చూసి నన్నే మరచిపోతి
యేసయ్యా నిన్ను చూసి నన్నే మరచిపోతి యేసయ్యా.. ఓ యేసయ్యా..
నా యేసయ్యా నిన్ను చూసి నన్నే మరచిపోతి
నా రక్షకుడా నీవు నా ఇంటికి రాగా
నా బ్రతుకుమారిపోయే నా బాధతీరిపోయే
నా బ్రతుకుమారిపోయే నా బాధ తీరిపోయే యేసయ్యా.. ఓ యేసయ్యా..
నా యేసయ్యా నీరాక నాకు రక్షనిచ్చెనయ్యా
నా ప్రియుడా నీవు అతిమనోహరుడవ్
ఆనందభరితుడనై ఆరాధింతు నిన్ను
ఆనందభరితుడనై ఆరాధింతునిన్ను ఆనంద.. ఓ ఆనంద..
నేనంద భరితుడనై ఆరాధింతునిన్ను
-------------------------------------------------
CREDITS : Pst Israel Garu
Music : Jk Christopher
-------------------------------------------------