** TELUGU LYRICS **
పవిత్రుడు నిర్దోషీ నిష్కళంకుడు
పాపులలో చేరక ప్రత్యేకమైనాడు (2)
నాయందు పాపముందని స్థాపించగలవారెవరని
పాపులలో చేరక ప్రత్యేకమైనాడు (2)
నాయందు పాపముందని స్థాపించగలవారెవరని
సమాజాన్ని సవాలు చేసిన పరిశుద్ధుడు (2)
సర్వజ్ఞానియు సర్వవ్యాపియు సర్వశక్తిగలవాడు
సర్వజ్ఞానియు సర్వవ్యాపియు సర్వశక్తిగలవాడు
ప్రేమపూర్ణుడు లోపరహితుడు పాపాన్ని ఖండించువాడు
పరలోక పట్టణమందు దేవునితో సమముగా ఉండుట
విడిచిపెట్టకూడదంటూ యోచించుకోకుండా (2)
నీకోసం నాకోసం పరము నుండి భువికొచ్చి (2)
రిక్తునిగా చేసుకున్న త్యాగశీలి ప్రభువు
పరలోక పట్టణమందు దేవునితో సమముగా ఉండుట
విడిచిపెట్టకూడదంటూ యోచించుకోకుండా (2)
నీకోసం నాకోసం పరము నుండి భువికొచ్చి (2)
రిక్తునిగా చేసుకున్న త్యాగశీలి ప్రభువు
||సర్వజ్ఞానియు||
ఈ లోక జీవితంలో మాదిరిగా ఉండుటకై
శోధనలెన్ని వచ్చినా పరిశుద్ధత వీడకుండా (2)
నీకోసం నాకోసం మాదిరిగా తను వుండి (2)
జీవించడం నేర్పించిన మార్గదర్శి ప్రభువు
ఈ లోక జీవితంలో మాదిరిగా ఉండుటకై
శోధనలెన్ని వచ్చినా పరిశుద్ధత వీడకుండా (2)
నీకోసం నాకోసం మాదిరిగా తను వుండి (2)
జీవించడం నేర్పించిన మార్గదర్శి ప్రభువు
||సర్వజ్ఞానియు||
మన శిక్ష తప్పించుటకు తను శిక్షను భరియించి
మన పాప విడుదల కొరకు తన ప్రాణమునివ్వదలచి (2)
నీకోసం నాకోసం తన ప్రాణమర్పించి (2)
మన శిక్షను భరించిన ప్రేమశీలి ప్రభువు
మన శిక్ష తప్పించుటకు తను శిక్షను భరియించి
మన పాప విడుదల కొరకు తన ప్రాణమునివ్వదలచి (2)
నీకోసం నాకోసం తన ప్రాణమర్పించి (2)
మన శిక్షను భరించిన ప్రేమశీలి ప్రభువు
||సర్వజ్ఞానియు||
నమ్మి మారుమనస్సును పొంది బాప్తిస్మమును స్వీకరించి
సంఘమందు స్థిరముగా ఉంటూ నమ్మకముగా సాగుచుండు (2)
నీకోసం నాకోసం పరము సిద్ధముగా ఉంది (2)
ఈ మార్గం మనకేర్పరచిన రక్షకుండు ప్రభువు
నమ్మి మారుమనస్సును పొంది బాప్తిస్మమును స్వీకరించి
సంఘమందు స్థిరముగా ఉంటూ నమ్మకముగా సాగుచుండు (2)
నీకోసం నాకోసం పరము సిద్ధముగా ఉంది (2)
ఈ మార్గం మనకేర్పరచిన రక్షకుండు ప్రభువు
||సర్వజ్ఞానియు||
----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : K. Syam Babu
Music & Vocals : Prasanth Penumaka & K.Dinesh
----------------------------------------------------------------------------