4845) ఒంటరినై నేనుండగా వేయిమందిగ నను మార్చినావు

** TELUGU LYRICS **

ఒంటరినై నేనుండగా వేయిమందిగ నను మార్చినావు 
ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా 
ననువాడుకో నా యేసయ్య నీ సేవలో నను వాడుకో 
ననువాడుకో నా యేసయ్య పరిచర్యలో నను వాడుకో (2)
||ఒంటరినై||

షిత్తీములో ప్రజలు వ్యభిచారము చేయగా నీ కోపము 
రగులుకొని తెగులును పంపితివి
నీవు ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుచు 
నీ యందు ఆసక్తి చూపిన ఫినేహాసులా
||ననువాడుకో||

ఆనాటి ప్రజలందరితో తన సాక్ష్యము చెప్పుచు 
ఎవని యొద్ద సొమ్మును నేను  ఆశించలేదని 
ప్రార్ధన మానుట వలన పాపమని ఎంచుచు 
శ్రేష్ఠమైన సేవ చేసిన సమూయేలులా
||ననువాడుకో||

నా జనులు చేయుచున్న పాపములు చూడగా 
నా కళ్ళు కన్నీటితో క్షీణించుచున్నవి 
కన్నీటి ప్రార్ధనతో ప్రజల యొక్క విడుదలకై
ప్రార్ధనతో పోరాడిన యిర్మియాలా
||ననువాడుకో||

-------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. Prakash Garu
Vocals & Music : Bro.Nissi John Garu & Daniel John
Youtube Link : 👉 Click Here
-------------------------------------------------------------------------------