4771) తనివి తీరదు నా బ్రతుకంతయు నిన్నే స్తుతియించిన

** TELUGU LYRICS **

తనివి తీరదు నా బ్రతుకంతయు
నిన్నే స్తుతియించిన యేసయ్య యేసయ్య 
ఉండలేను నిన్ను తలువకుండా
నడువలేను నీ తోడు లేకుండా
యేసయ్యా యేసయ్యా నాకు చాలిన దైవమా నేస్తమా
యేసయ్యా నాయేసయ్యా నాకు చాలిన దైవమా నేస్తమా

అపవాది వలలో పడియున్న వేళలో
అరచి అరచి బలహీనుడనవగా (2)
చూచి నవ్విన వారు ఎందరో
ఎగతాళి చేసి నవ్విన వారెందరో
నా బంధకములు పడగొట్టినావు
నా తలనెత్తి దీవించినావు (2)
యేసయ్యా యేసయ్యా నాకు చాలిన దైవమా నేస్తమా
యేసయ్యా నాయేసయ్యా నాకు చాలిన దైవమా నేస్తమా
                               
నిజమైన ద్రాక్షవల్లివి నీవే 
నీలోన నిలచి బహుగా ఫలించి (2)
సజీవుడనై ఇలా వర్ధిల్లితి 
నీ కనికరమే నన్ను కాపాడెనయ్యా
నాదు మరణ స్థితిని చెరిపి 
నీదు ఆత్మతో నింపితివయ్యా (2)
యేసయ్యా యేసయ్యా నాకు చాలిన దైవమా నేస్తమా
యేసయ్యా నాయేసయ్యా నాకు చాలిన దైవమా నేస్తమా

 నీసేవ చేయ ఆశను కలిగి 
పరుగెత్తెదను కడవరకు నేను (2)
సర్వలోకంలో సర్వ సృష్టిలో
నీ పిలుపు నొంది నిన్ను ప్రకటించు వారెందరో
నీకృపతోనే నన్ను బలపరచి
నీ సేవలోనే నన్ను సాగనిమ్ము (2)
యేసయ్యా యేసయ్యా నాకు చాలిన దైవమా నేస్తమా
యేసయ్యా నాయేసయ్యా నాకు చాలిన దైవమా నేస్తమా
||తనివితీరదు||

--------------------------------------------------------
CREDITS : Music : Ashok. M
Lyrics, Tune, Vocals: Vatam Samuel
--------------------------------------------------------