** TELUGU LYRICS **
ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా
నీలా రక్షించేవారెవరున్నారయ్యా
ఏ కీడురాకుండా ఏ మరణము లేకుండా
నీలా కాపాడేవారెవరున్నారయ్యా
నీలా రక్షించేవారెవరున్నారయ్యా
ఏ కీడురాకుండా ఏ మరణము లేకుండా
నీలా కాపాడేవారెవరున్నారయ్యా
మాయోను అరణ్యములో రాజైన సౌలు
దావీదును చుట్టుముట్టి చంపచూసెను
శత్రువులు దండెత్తి దేశములో చొరబడగా
దావీదును తరుముట మాని వెనుకకు తిరిగిరి
రోషముకలిగి నీకొరకై నిలిచి
బంగారు ప్రతిమకు మ్రొక్కకుండిరి
ఎప్పటికన్నను గుండమును ఏడంతలు మండించి
షద్రకు మేషాకు అబేద్నెగోలను పడద్రోసిరి
దమస్కులోని యూదులకు సువార్తను ప్రకటిస్తూ
క్రీస్తును గూర్చి రుజువిస్తూ కలవరపరిచేను
పౌలును చంపజూసి రాత్రింబవళ్ళు కాచుకొనిరి
శిష్యులు పౌలును గంపలో ఉంచి తప్పించి
----------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Bro. Prakash Garu
Vocals & Music : Sis.Surekha Garu & Daniel John
----------------------------------------------------------------------------