** TELUGU LYRICS **
నీలా నేనుంటానయ్యా నాలో నీవుంటేనయ్యా (2)
నిన్నే కలిగి నన్నే మరచిపోవాలి
నా మరణం వరకు నీతోనే నడవాలి
నీ నిత్యమహిమలో నీతో నిలచిపోవాలి (2)
యేసయ్యా యేసయ్యా ఇదే నాకున్న ధ్యాసయ్య
యేసయ్యా యేసయ్యా ఇదే నాచివరి ఆశయ్య (2)
నిన్నే కలిగి నన్నే మరచిపోవాలి
నా మరణం వరకు నీతోనే నడవాలి
నీ నిత్యమహిమలో నీతో నిలచిపోవాలి (2)
యేసయ్యా యేసయ్యా ఇదే నాకున్న ధ్యాసయ్య
యేసయ్యా యేసయ్యా ఇదే నాచివరి ఆశయ్య (2)
మంటినైన నన్ను నీవు మహిమగా మార్చుటకు
మహిమ కలిగిన నీవు మనిషిగా ఏతెంచావు.
వాడబారనీ నీ మహిమను నే పొందుటకు
విలువైన రక్తము నిచ్చి నీసొత్తుగా మార్చావు (2)
శ్రమల కొలిమిలో నన్ను పుటము వేసిన
పరిశుద్ధ జీవితం నాకు దయచేసినా (2)
మహిమ కలిగిన నీవు మనిషిగా ఏతెంచావు.
వాడబారనీ నీ మహిమను నే పొందుటకు
విలువైన రక్తము నిచ్చి నీసొత్తుగా మార్చావు (2)
శ్రమల కొలిమిలో నన్ను పుటము వేసిన
పరిశుద్ధ జీవితం నాకు దయచేసినా (2)
||నీలా నే||
నా వేదన భాదలలో ఓదార్పు నే పొందుటకు
ఎన్నో భాధలనుభవించి మాధరి చూపించావు
నిత్యమహిమాలో నే వారసత్వమొందుటకు
శ్రమలనే సీలువను మోయగా నన్ను ఎన్నుకున్నావు (2)
నీదు సారెపై నన్ను మలచినా
నీదు రూపులోనికి నన్ను మార్చివేసినా (2)
||నీలా నే||
---------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Pas. J Kumar
Vocals & Music : Nissi John & Jakie Vardhan
---------------------------------------------------------------------