4747) నీ సన్నిదే చాలు నీ కౌగిలే మేలు నే కోరను ఇలలోనిది

** TELUGU LYRICS **

నీ సన్నిదే చాలు నీ కౌగిలే మేలు
నే కోరను ఇలలోనిది ఆశించను క్షయమైనది
జీవింతును నీలో జీవింతును నీలో జీవింతును నీలో

నీలో నిలచి నివసింతును నీతో నడచి సాగిపోదును
నీలో నాటబడి ఫలియింతును నీచే దీవించబడి తృప్తిపడెదను (2)
ధ్యానింతును నిన్నే ప్రతిక్షణము
స్తుతియింతును నిన్నే అనుదినము (2)
వ్యాధి అయినను బాధ అయినను దుఃఖమైనను ఉపద్రవమైనను
నేనేమైనాను
||జీవింతును||

నీ సువార్త ప్రకటింప శక్తినివ్వుమా నీ ప్రేమను వివరింప మనసునివ్వమా 
శ్రమలైనను బరియింప కృపనివ్వుమా ప్రాణమైన అర్పించ భాగ్యమివ్వుమా (2)
ప్రకటింతును నీ కృపా వాక్కును 
వివరింతును నీ ప్రేమ సువార్తను (2)
కరువైనను ఖడ్గమైనను శ్రమలైనను హింసైనను 
నేనేమైనాను
||జీవింతును||

------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Rev. P. Nathan 
Vocals & Music : Nissi John & Blessy Enosh Perla
------------------------------------------------------------------------------