4720) నీ మాటలోనే జీవమున్నది యేసయ్య నీ బాటలోనే క్షేమమున్నది యేసయ్య

** TELUGU LYRICS **

నీ మాటలోనే జీవమున్నది యేసయ్య
నీ బాటలోనే క్షేమమున్నది యేసయ్య (2)
అదియే నాలో జీవించుచున్నది 
అదియే నాకు క్షేమము నిచ్చుచున్నది (2)

వేశ్య అయినా స్త్రీ చెడు మార్గంలో తిరుగుచుండగా 
అమ్మ అని పిలచి నీ మార్గంలో నిలిపావు (2)
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్య (2)
||నీ మాటలోనే||

పారిపోయిన యోనాను ప్రేమతో గద్దించావు 
చేప కడుపులో మరణం తొలగించావు (2)
నీలో ప్రేమ నీలో క్షేమం నీలో నిత్యజీవం యేసయ్య (2)
||నీ మాటలోనే||

-----------------------------------------------
CREDITS : Lyrics, Tune : Anil
Music, Vocals : Y. Sunil Kumar
-----------------------------------------------