4746) దేవుని పిలుపు ఉందని నీవు మరువకు ఆ పిలుపు ఎపుడొస్తుందో

** TELUGU LYRICS **

దేవుని పిలుపు ఉందని నీవు మరువకు
ఆ పిలుపు ఎపుడొస్తుందో నీవు ఎరుగవు (2)
ప్రతి ఒక్కరికి పంపుతాడు ఆహ్వానము
అందుకొనుటకు ఎదురుచూడాలి అందరము (2)
మరణమే ఆపిలుపనీ మరణమే ఆ ఆహ్వానమని (2)
||దేవువిపిలుపు||

ఆత్మగా ఉన్న నీకు తల్లిగర్భములో ఆకారమిచ్చి
కొంతకాలము ఆయుష్షునిచ్చి పుడమిపై ఉంచెను నిన్ను దేవుడు (2)
భూమిపై ఉన్నంతకాలము ఆయనపనిలో నీవుండాలని
నీకియ్యబడిన పనిపూర్తయితే ఆయనతో ఉండుటకు వెళ్లిపోవాలని
పిలిచాడు దేవుడు నరులారా తిరిగిరండని తనయొద్దకు (2)
మరణమే ఆపిలుపనీ మరణమే ఆ ఆహ్వానమని (2)
||దేవువిపిలుపు||

అప్పగించిన పనిని  చేయుటకే నాడు వచ్చాడు క్రీస్తుయేసు
భూమిపై పనిని పూర్తి చేసి ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు (2)
దేహములో ఉన్నంతవరకు దేవుని పనిలో నీవుండాలని
నీదేహమును విడిచిపెడితే దేవునితో ఉండుటకు వెళ్లిపోవాలని
దేవునిపనిలో ఉన్నవారికి ఆయన పిలుపే ఒక వరం
లోకపనులలో మునిగిన వారికి ఆయన పిలుపే తీరని శోకము
మరణమే ఆపిలుపనీ మరణమే ఆ ఆహ్వానమని (2)
||దేవువిపిలుపు||

---------------------------------------------------------------------------------------
CREDITS : Music : Prasanth Penumaka Garu
Lyrics, Tune & Vocals : B.Nanibabu Garu & Dinesh Garu
---------------------------------------------------------------------------------------