4669) ప్రతి ఉదయము నీ కృపపొంది దినమంతయు నీ ముఖకాంతిలో

** TELUGU LYRICS **

ప్రతి ఉదయము నీ కృపపొంది
దినమంతయు నీ ముఖకాంతిలో
వర్ధిల్లెదను నిన్నే స్తుతించుడి
సాగిపోయెదను నిన్నే పాడుచు

నావారు అనుకున్నవారందరు
దూరాన నిలిచిన సమయములో
నీ ప్రేమే కదా చేరదిసినది
నన్నీస్థితిలో నిలిపినది కృపయేకదా 
||ప్రతి||

నీతోనే ఇక నా సహవాసము
నీకొరకు జీవించుట నేర్పుము
ఇక నాజీవితం నీకే అంకితం
నాధైర్యము నాబలము నీవేకదా   
||ప్రతి||
  
కరుణించి నను చేరదీసితివి
నీ సన్నిధిని విడువ నెన్నటికి
సర్వసంపదలకు నిధి నీవేకదా
అవసరములన్ని తీర్చే నాతండ్రివి
||ప్రతి||

----------------------------------------------------------------------------------------
CREDITS : Music, Vocals, Lyrics : Pas. PaulPraveen Garu 
Youtube Link : 👉 Click Here
----------------------------------------------------------------------------------------