** TELUGU LYRICS **
నిశీధి రాత్రులలో నిరాశ నిస్పృహలో
ఆశల గగనములో అలసిన పయనంలో
సాగిపోవుచుంటివా ఓ నేస్తమా
నీ తోడు ఎవరయ్యా నీ నీడ ఎవరయ్యా
||నిశీధి||
అపవాది చెంత చేరి అలిసి సొలసి పోతివా
అంధకార శక్తులతో పోరాడి ఓడితివా
నీ గతము తలచుకొని కుమిలి కుమిలి ఏడవక
నా బ్రతుకు వ్యర్థమని నీరసించి పోక
యేసయ్య చేయి అందుకో నీ బ్రతుకు మార్చుకో
||నిశీధి||
నీ స్థితిని చూచి జనులు నిందలెన్నో వేసితిరా
కృంగి పోయి కలత చెంది కన్నుమూయ తలచితివా
బంధువులు స్నేహితులు నిను దూరం పెట్టినా
చూపులతో మాటలతో నీ గుండెను కోసినా
ఆ ప్రేమ మూర్తి యేసునే ఆధారం చేసుకో నెమ్మదిని పొందుకో
||నిశీధి||
ఆశల గగనములో అలసిన పయనంలో
సాగిపోవుచుంటివా ఓ నేస్తమా
నీ తోడు ఎవరయ్యా నీ నీడ ఎవరయ్యా
||నిశీధి||
అపవాది చెంత చేరి అలిసి సొలసి పోతివా
అంధకార శక్తులతో పోరాడి ఓడితివా
నీ గతము తలచుకొని కుమిలి కుమిలి ఏడవక
నా బ్రతుకు వ్యర్థమని నీరసించి పోక
యేసయ్య చేయి అందుకో నీ బ్రతుకు మార్చుకో
||నిశీధి||
నీ స్థితిని చూచి జనులు నిందలెన్నో వేసితిరా
కృంగి పోయి కలత చెంది కన్నుమూయ తలచితివా
బంధువులు స్నేహితులు నిను దూరం పెట్టినా
చూపులతో మాటలతో నీ గుండెను కోసినా
ఆ ప్రేమ మూర్తి యేసునే ఆధారం చేసుకో నెమ్మదిని పొందుకో
||నిశీధి||
------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Suresh Babu Panthagani
Music & Vocals : Sampath kareti & Surya Prakash Injarapu
------------------------------------------------------------------------------------------