4359) ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ


** TELUGU LYRICS **

ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ
డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ (2)
సిరిసంపదలంటూ బ్రతుకునుకాలరాసుకుంటూ
మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా
పట్టుకుని వెళ్ళలేవురా చిల్లిగవ్వ కూడా
చితిలో నీతో రావుగా అవి లక్షకోట్లయిన (2)
ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా
సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా (2)

ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ
డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ
ధనమంత నీకు కావాలంటే అన్ననే చంపమంటుంది 
ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది (2)
తరాలుతిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది 
తరిగిపోని ఆస్తోకటున్నదని మరిచిపోయేలా చేస్తుంది (2)
మానప్రాణాలు తీయమంటుంది 
అనుబంధాలను తెంచమంటుంది 
నీచ కార్యాలు చేయమంటుంది 
వదిలెల్లాలని మరిపిస్తుంది
ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా
సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా (2)

ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ
డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ
ధనాన్ని దాచిన అననీయ తెచ్చుకున్నాడు మరణాన్ని
బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని (2)
బంగారాన్ని కోరిన గెహజి తెచ్చుకున్నాడు 
రోగాన్ని వెండిని ఆశించిన యుదా తీసుకున్నాడు ప్రాణాన్ని (2)
ఆరోగ్యాలను కోల్పోయారు
ఆత్మీయంగా చనిపోయారు
కీడులెన్నో కొని తెచ్చుకున్నారు
నరక యాతనలు పడుతున్నారు
ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా
సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా (2)

ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ
డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ (2)
సిరిసంపదలంటూ బ్రతుకును కాలరాసుకుంటూ
మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా
పట్టుకుని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా
చితిలో నీతో రావుగా అవి లక్ష కోట్లయినా (2)
ధనమే ఒక మాయరా దానికై ఆశపడకురా
సిరియే ఒక మత్తురా దాన్ని దేవుని పనికై వాడరా
ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా
సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా

---------------------------------------------------------------
CREDITS : Music : Prashanth Penumaka
Lyrics Tunes : Br.K.Sahasashali garu 
---------------------------------------------------------------