4487) బేత్లేహేము పురమునందు పశువుల పాకయందు పుట్టినాడు యేసు దేవుడు

** TELUGU LYRICS **

బేత్లేహేము పురమునందు
పశువుల పాకయందు
పుట్టినాడు యేసు దేవుడు
మన అందరికి రక్షకుడు (2)
ఆహ్లాదకరమైన సందడి సందడి
సంతోషకరమైన సంబరం సంబరం (2)

కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను
పాప భారము మొయువాడై మనకొరకై ఉదయించెను (2)
చూద్దాము రండి జనులరా పూజింతుము రండి ప్రజలారా (2)
Happy Christmas Merry Christmas సందడి చేద్దాము రండి
||బేత్లేహేము||

ఆకాశంలో చుక్కను చూసి జ్ఞానులు శాస్త్రలు
బంగారమును సాంబ్రాణియు బోలములను అర్పించిరి (2)
చూద్దాము రండి జనులరా పూజింతుము రండి ప్రజలారా (2)
Happy Christmas Merry Christmas సందడి చేద్దాము రండి 
||బేత్లేహేము||

దూతలేళ్ళరు చాటి చెప్పిరి ప్రవచనాలు నెరవేరునట్లు
తన ప్రజలను పాపము నుండి ఇమ్మానుయేలు రక్షించెను (2)
చూద్దాము రండి జనులరా పూజింతుము రండి ప్రజలారా (2)
Happy Christmas Merry Christmas సందడి చేద్దాము రండి
||బేత్లేహేము||

-------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------