4330) నీ ప్రేమ మధురము నీ కృప అమరము నీ దయతో నిరతము


** TELUGU LYRICS **

నీ ప్రేమ మధురము - నీ కృప అమరము
నీ దయతో నిరతము - మమ్మును కావుము
ఈ కష్ట సమయము - తోడుగా నిలువుము
ప్రతిక్షణం మమ్మును - నీ నీడలో దాయుము
యేసయ్యా - యేసయ్యా ఒక మాట సేలవిమ్మయా
మము స్వస్థపరచుమయా

నే కృంగియున్నాను - పోరాడి ఓడాను
మార్గమే మరచిన నాకు - త్రోవ చూపుమయా
నా కష్టకాలములో - నా దుఃఖదినములలో
నా ప్రతి శోధనలు నీవు తొలగించుమయా

నీ సన్నిధిలో సంతోషం - నే పొందియున్నాను
దినమెల్ల కీర్తించెదన్ నిను కొనియాడెదన్
నా చెంత నీవుంటే - నేనేల భయపడుదున్
ఏ అపాయము రాకుండా కాపాడుమయా

--------------------------------------------------------
CREDITS : Lyrics : Sam K Kriran 
Vocals : Sharon Philip & Hana Joyce
-------------------------------------------------------