4312) ఎదురు చూస్తున్నాను నా యేసయ్యా నీ రాక కోసమే


** TELUGU LYRICS **

ఎదురు చూస్తున్నాను - నా యేసయ్యా
నీ రాక కోసమే - నా మెస్సయ్యా (2)
నువ్వొవస్తావనే - ఆశతో నేనున్నానయ్యా
నీ రాకడ గురుతులు - నెరవేరెనయ్యా (2)
అ.ప: రావయ్యా యేసయ్యా - జాగు చేయక
నాకున్న ఆశలను - విసిగించక (2) 
||ఎదురు||

లోకం జిగటగల దొంగ - ఊబిలా లాగుచున్నది
జనుల పాపం నానాటికి - పెరిగి పోవుచున్నది (2)
రాజ్యము మీదికి రాజ్యం - జనము మీదికి జనము 
బయలుదేరుచుండుటకు - సిద్ధపడుచున్నవి (2)
ఎక్కడ చూచినా - భూకంపములే 
ఎక్కడ చూచినా - కరువు యుద్ధములే (2) 
||రావయ్యా||  ||ఎదురు||
               
మధ్యాకాశం దూత శబ్ధం - ఆర్భాటముతో వినిపించగా
సమాధులలో నిద్రించువారు - భక్తులు మొదట లేవగా (2)
మేఘములమీద సంఘం - రెప్పపాటులో లేచి 
కొనిపోబడగా చూచి - ప్రలాపించెదరు (2) 
ఎక్కడ చూచినా - దౌర్జన్యములే
ఎక్కడ చూచినా - అరాచకములే (2)
||రావయ్యా||  ||ఎదురు||

--------------------------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Vocals : Rev Anand Kumar Alli & Surya Prakash Injarapu
Music : Nimshi Zacchaeus
--------------------------------------------------------------------------------------------------------------------