** TELUGU LYRICS **
సీయోనులో స్తిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు
సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు - లేనే లేని
ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా
||సీయోనులో||
నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు
సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు - లేనే లేని
ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా
||సీయోనులో||
కడలిలేని కడగండ్లులేని
కల్లోల స్థితిగతులు - దరికే రాని
సువర్ణ వీధులలో - నడిపించెదవా - నా యేసయ్యా
||సీయోనులో||
కలతలు లేని - కన్నీరు లేని
ఆకలి దప్పులు - అసలే లేని
నీ శాశ్వత రాజ్యముకై - సమకూర్చుచున్నావా - నా యేసయ్యా
||సీయోనులో||
సంఘ ప్రతిరూపము - పరమ యెరూషలేము
సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము- నిత్యము ఆనందమే
||సీయోనులో||
-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------