4238) నిత్యాశ్రయదుర్గమైన యేసయ్యా తరతరములలో


** TELUGU LYRICS **

నిత్యాశ్రయదుర్గమైన యేసయ్యా
తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి
ప్రణమిల్లెదను - ప్రణుతించెదను - పరవశించెద నీలోనే

నా నీతి సూర్యుడా నీ నీతికిరణాలు
నీ మార్గములలో - నన్ను నడిపించెనే
నా నిత్య రక్షణకు కారణజన్ముడా
నీకే సాక్షిగా - తెజరిల్లెదనయ్యా 
||నిత్యా||

నా అభిషిక్తుడా - నీ కృపావరములు
సర్వోత్తమమైన మార్గము చూపెనే
మర్మములన్నియు బయలుపరచువాడా
అనుభవజ్ఞానముతో - నేనడచెదనయ్యా
||నిత్యా||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------